Chapter 29
"ధర ధరణిలొ ధరియించెను
ధర మర్మము తెరిపించును
వేదములు ఎన్నుండును
నరసింహుడు ఉదయించును
ధను రాశిని మెరిపించెను
నిటలాక్షుడు జరిపించును
ధర మర్మము కనిపించును "
" సీతా ఒక్కసారి పక్కకి జరగవే , అక్కడ ఎదో కనిపిస్తోంది",మధు ని ఫాలో అయ్యారంతా.
" లోకేష్ , ఎమిట్రా ఈ చెత్త రాతలు, ఏదో Treasure Hunt లా ఉంది కదా",
" Treasure Hunt లా వుండటం కాదు, Treasure Hunte !!!!, గాయత్రీ ఈ పద్యం చదువు నీకు ఎమైన క్లూ దొరుకుతుందేమో!!"
" బావా, ఆట continue చెద్దాము రండి "
" అయినా ఇంకా ఆటలేంటి చిన్న పిల్లలాగా, ఈ పద్యం చందస్సు చెప్పు ఇటొచ్చి "
" మాకు చంపకమాల, ఉత్పలమాలే వున్నాయి.. ఇదేంటొ నాకు తెలియదు"
" సుమాగమాల తెలియదా , మసగ-నస-భజన దీని గాణాలు" మధుగాడు డబ్బా స్టార్ట్ చేశాడు..
" ఆపండిరా సోది గోల, పని చూడండి ముందు, నీ కోతలు వినటానికి ఆ చిన్న పిల్లే దొరికింది పాపం ..తెలుగు లొ ఫైల్ అయిన సన్నాసి వెధవా!!',
....
....
" దీన్ని చూస్తుంటే చాలా పాతకాలం పలకంలాగా వుంది. కాని ఈ పద్యంలో వున్న తెలుగు
మాత్రం చాలా సరళంగా వుంది. ఇంత వాడుక తెలుగులో పద్యాలు రాయటం బట్టి చూస్తే ఇది 200 ఇయర్స్ కంటే పాతది అయ్యే చాంసెస్ తక్కువ.అదే నిజమైతే ఇక్కడ రాజులు పొందగ వచ్చిన నిధి misleading గా వుంది."
గాయత్రి చెప్పేది వింటున్నారు అందరు..
" గాయత్రి, మొదటి పద్యానికి, రెండవ పద్యానికి తేడా వున్నట్లుంది, చూశావా !",
" అవును నిజమే లోకేష్!, మొదటి పద్యం చెక్కిన font , రెండవ దాని font తేడాగా వున్నాయి..సీతా ఈ లోపు ఇంకేదైనా పద్యాలు వున్నాయేమో చూడవా రాతి మండపం మొత్తంలో..ఒక్కొక్క పద్యానికి 100 ఇస్తాను.డీల్--"
" డీల్ -- అక్కా " , సీత CID పని మొదలెట్టింది.
" ఈ fontలు కావాలని వేరుగా రాసినట్లు తెలిసిపోతోంది .అంటే రెండు వేరు వేరుగా ట్రీట్ చెయ్యాలన్నమాట. అర్కియాలజీలో మొదటి లెసన్ fontని బట్టి inscriptions అర్దాలు మారచ్చని.చాలా సందర్బాలలో font మారితే శిల్పి మారినట్లు లెక్క. అంటే, ఈ రెండు పద్యాలు ఒకే కాలానికి కూడా చెందినవి కాకపోవచ్చు.ఈ బండని Dating చేయిస్తే ఆ రెండు పద్యాలు ఒకే క్లూని ఇండికేట్ చేస్తున్నాయో లేదో చెప్పచ్చు."
" Dating అంటే గుర్తుకు వచ్చింది, ఒరేయ్ లొకేష్ గా , నీ వల్ల stella date మిస్ అవుతున్నాను " దీపక్ గొణగటం గాయత్రికి వినిపించేసింది.
" గాయత్రి, మొదటి పద్యం కంటే రెండవ పద్యం క్లూ కి దగ్గర గా వుంది.చూడు
ధర ధరణిలొ ధరియించెను - ధరణి అంటే భూమి కాబట్ట్టి , ధరణిలో ఏదొ వుందని చెప్తోంది క్లియర్ గా " లోకే ష్ ఇచ్చిన స్టార్ట్ కి మూడ్ వచ్చింది అందరికి.
" Crosswords వీరుడా విజయ్ కృష్ణ , విజృంభించు " మధు encouragementకి విజయ్ అలోచించటం మొదలుపెట్టాడు ..
" ధర అంటే రేటు, విలువ , కలిగి వుండటం ... అంటే ఏదో విలువ భూమిలో ధరించినది అని ఉంది ...ఏదైనా విగ్రహముందేమో లోపల, విలువ గల నగ ఏదో ఉండుంటుంది. "
" కానీ విజయ్ , ఒక్క నగ కోసం ఇంత రిస్కు తీసుకుంటారా ఎవరైనా , నాకు నమ్మ బుద్ది కావటం లేదు. అయినా లైట్ లే , అది ఏదైతే మనకెందుకు...next చూడు "
" ధర మర్మము తెరిపించును - మర్మము అంటే సీక్రెట్ , తెరిపించును , ఇక్కడ ధర ఏమిటొ " అలోచిస్తున్నాడు విజయ్
" హె , ఐ గాట్ ఇట్ ... జుంబుల్ చెయ్యండి - మర్మము ధర తెరిపించును ... అంటే సీక్రెట్ ధర తెరిపించును,
సొ, మన క్లూ భుమిని ఓపెన్ చేయిస్తుందన్నమాట !!!" దీపక్ విజయ గర్వంతో అన్నాడు దీపక్ గాయత్రి వైపు చూస్తు...
సీత ఇంకా వెతుకుతూనే వుంది ...ఏది దొరకలేదు ..
/******************************/
అక్కడికి వంద మీటర్ల దూరం లో ...
" నర్సింగ్ , రాతి మండపం దగ్గర ఎవరో వున్నట్లు వున్నారు , ఇవాళ మన పని అయ్యేటట్లు లేదు.. ఏదొ వన భోజనాలు లాగా వుంది..వెళ్ళి బెదిరించి పంపెద్దామా ఖాన్ వచ్చే లోపల "
" అలాంటి పిచ్చి పనులే వద్దు . మనము ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి తెలియ కూడదు... అసలే JP పొయాక ఎందుకో నాకు అనుమానంగా వుంది , దీని వెనక ఇంకెవరి హస్తమైన ఉందేమోనని . మనం చేసే ప్రతి తప్పు మనల్ని పట్టిస్తుంది.. సరలే గాని , ఖాన్ కి ఫొన్ చెయ్యి , ఏన్నింటికి వస్తున్నాడో ?.."
...
" ఖాన్ , నేను గొపాల్ ని , బయల్దేరావా ?"
" నేను పోలవరం వచ్చి గంటయ్యింది. కాని మన ప్లాన్ చేంజ్ చెస్తున్నాను.
మనం రేపు వెల్దాం మండపానికి . మూర్తి కొడుకు మీద నాకు అనుమానంగా వుంది.
వాడు ఎప్పుడు పోతున్నాడో అమెరికాకి ... కనుక్కో ఈ లోపల. "
" కాని ఎందుకు చేంజ్ చేసావ్ , మాతో ఒక్క మాటైన చెప్పకుండా "
" అంతా వివిరంగా తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి ఉంటాను "
/*************************/
" వేదములు ఎన్నుండును"
" నాలుగుండును" సీత పరిగెత్తింది , బావ కొడతాడని తెలుసు..
" వెటకారామా, ఉండు నీ పని చెప్తా ," మధు పరిగెత్తి వెళ్ళాడు ..
" లోకేష్ , సీత చెప్పింది obvious గా వున్నా , రిలవెంట్ గానే ఉంది కదా "
" గాయత్రి నువ్వు కూడాన ...ఛ .. "
" హె లోకేష్, నాలుగుకి ఏదో లింకు ఉండే ఉంటుంది. నాకు అదే అనిపంస్తోంది . " విజయ్ కూడా తోడయ్యాడు...
"నరసింహుడు ఉదయించును"
" నా వల్ల కాదురా బాబు .. నరసింహుడు ఉదయించును, బ్రహ్మనాయుడు జన్మించును , ఇదంతా చూస్తుంటే సీతా వాళ్ళ friends మనల్ని ఆట పట్టించటానికి ఆడుతున్న నాటకం లాగావుంది . నాకు నిద్రవస్తోంది , నేను పడుకుంటాను . మీ debugging అయ్యాక లేపండి" దీపక్ కి విసుగు పుట్టింది . ఆసలే గాయత్రి దగ్గర ఇంప్రెషన్, stella Date పొయిన బాధ లొ ఉన్నాడు.
" కలికాలం . డాక్టర్లు కూడా debugging గురించి మాట్లాడటం కడు సోచనీయం . బాధాకరం .." NTR వాయిస్ ఇమిటేట్ చేశాడు లోకేష్ ...
అంతా నవ్వుకుంటున్నారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home