Sunday, July 03, 2005

Chapter 21

లోకేష్ ఫోన్ కిందపెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు. మెల్లగా ఒక plan రూపుదిద్దుకుంది అతని మనసులో. దీపక్ కి కాల్ చేశాడు, "ఒరేయ్, నీకు వచ్చే రెండు, మూడు వారాల్లో రాచకార్యాలేమీ లేవుకదా?"
"అలాంటివేమీ లేవు, ఉంటే గింటే ఏమన్నా అన్నీ చెలికత్తెలతోనే"
"మనం ఇండియా వెళ్తున్నాం"
"ఓకే. లంచ్ కి ఏమి చేద్దాం ఈరోజు?"
"..."
"నువ్వు ఇందాక ఇండియా అన్నావా?"
"ఆఁ"
"కొంచెం alert చేసి చెప్పొచ్చు కదా?"
"నీ కోసం ప్రతి విషయానికీ ముందూ వెనకా ఈల వేసి చెప్తార్రా? జాగ్రత్తగా విను. వచ్చేవారం మనం ఇండియా వెళ్తున్నాం. చెలికత్తెలతో పని కాదు, రాచకార్యానికే. ఈ విషయం మా ఇంట్లోకూడా తెలియదు"
"సీక్రెట్ మిషనన్నమాట"
"నీకు ఓకేనే కదా"
"మనం రెడీ. నాకసలు ఇలాంటి విషయాలంటే ఒక పులకరింత గా ఉంటుంది "
"టికెట్స్ బుక్ చేస్తున్నామరి"
"చేసెయ్! .... ఆగాగు, ఇంతకీ ఇండియాలో ఎక్కడికి? కేరళా? సిమ్లా? గోవా? ఖజురహో?"
"ఊలపల్లి"
"..."
"..."
"ఏమిటీ???"
ఫోన్ పెట్టేశాడు లోకేష్.

***************

మధు జామకాయ తింటూ వచ్చాడు వాళ్ల దగ్గరకి.
"ఏంట్రా, మాట్లాడుకున్నారా?"
విజయ్, నీలూ మౌనంగా ఉండిపోయారు.
"ఏం జరిగిందిరా?"
"ఏమీలేదు మధూ, నేను మీ ఇద్దరినీ మళ్లీ కలుస్తాను", గట్టు మీదనుంచి లేచాడు విజయ్.
"ఇంక చాలు మధూ, మీ జోకుల పుణ్యమా అని నాకు మాత్రం పుట్టెడు టెన్షన్ మిగులుతోంది. విజయ్ గారూ, ఇందాక మాట్లాడినవంతా మధు చెప్పమన్నమాటలే. దయచేసి ఏమీ అనుకోకండి. మీ అందరికి ఇలాంటివి light అని చెప్పే మధు నా చేత అలా జోక్ చేయించాడు .."
"ఏమీ అనుకోకుండా ఎలా ఉంటాడు, నువ్వు average గా ఏమన్నా నటించావా ?? వాడి మొహం చూస్తేనే అర్దం అవుతోంది నువ్వు ఎంత బాధపెట్టావో "
"ముందే గెస్ కొట్టుండాల్సింది", విజయ్ కి మళ్లీ " ప్రేమా , దోమా, ఇవన్నీ trash" మొదలైన డైలాగులు గుర్తొచ్చాయి.
"మీరు గెస్ కొట్టనందుకు నేను చాలా బాధపడుతున్నానండీ"
"అంటే, ఏమిటి నీలూ నీ ఉద్దేశం? అక్కడ సీత నా పరువు తీసి, ఇక్కడ నువ్వుతీసి, నా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందిరా విజయ్" మధు బాధ, బాధ లాగా లేదు.
పైసాచిక ఆనందాన్ని అస్సలు ఓర్చు కోవటంలేదు విజయ్ మనస్సు ... "పర్లేదులేరా, బాధపడకు, ఐనా, నీకు ఇంట్లో ఏదో పనున్నట్లుంది?"
"హుఁ, పని. ఇంట్లో. ఇప్పుడు. ఆహా, ఎంతటి subtle message? వెళ్లిపోతున్నాలే, కంగారుపడకండి."

విజయ్ - తిరుపతి - 23/07/2005 - సశేషం

3 Comments:

Blogger simplyme said...

ori naayanoi...malli katha back on track. toooo much.
vijay, neelu ni vijay ki raasipedithe tappa oorkunettu leve...;)

July 25, 2005 at 7:54 AM  
Blogger andhramahabharatam said...

మరి? శశికళని తప్పించి, మధుని తప్పించి, ఎన్ని అడ్డంకులొచ్చినా తప్పించి వాళ్లని మాట్లాడుకునేలా చేద్దామంటే మాట్లాడి చస్తేగా? బ్రతుకు జీవుడా అని వికేష్ వర్షాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత సంగతులు తర్వాత. ఈ కథకి "వర్షం" అని కూడా పేరు పెట్టొచ్చు.

Back on track అనుకోకు, కథ backtrack అయిపోగల్దు.

విజయ్

July 25, 2005 at 4:10 PM  
Blogger simplyme said...

idivaraku gamaninchaledu.. ee vikesh evaru? paina ekkada kanapadalede?
malli first ninchi oorke chadavadam start chesa... malli malli chaduvutunte okkokka kottha point telustundi annattuga undi... bhale raasaare anthaa kalisi.. ;)

February 27, 2006 at 11:02 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home