Thursday, November 29, 2007

Chapter 37 -రహస్యం

"నీ మొహం !!, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, వాళ్ళ కోసం పని చేసే అవసరం ఎవరికి వుంటుంది..." గాయత్రి అంది.
అప్పటి దాకా కష్టపడి పెంచుకున్న image ఒక్కసారి పడిపోవటంతో కొంచం నొచ్చుకున్నా వెంటనే తేరుకొని
" లోకేష్, మీ నాన్న గారు ఇంకా ఎదో దాస్తున్నారు అనిపిస్తోంది, ఇప్పుడు మనల్ని follow అవుతున్నారు అంటే మనం ఇంకా జాగ్రత్తగా వుండాలి. నీకు ఎమన్నా అనుమానమా ,,," అన్నాడు దీపక్ ..
" అవును రా ...నాకూ ఏదో దాస్తున్నారు అనే అనిపిస్తోంది, ఆ విషయం తర్వాత చూద్దాం కాని , ఇప్పుడు మాత్రం అందరు ఎమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోదాము, ఎవరూ తల తిప్పి కూడా చూడద్దు , జాగ్రత్తగా నటించి మనం వన భోజనాలకి వచ్చి నట్లు వెళ్ళి పోదాము. రేపు పొద్దున్నే వచ్చి ఈ గుహ సంగతి చూద్దాం. మనకి కావలసిన వస్తువులు, నేనూ దీపక్ వెళ్ళి పోలవరం లో తెస్తాం. "" లేదురా , నువ్వు విజయ్ ని తీసుకొని వెళ్ళు, నేను సీత వాళ్ళకి తోడుగా వెళ్తాను .. "
" అసలు విషయం మాకు తెలుసు లే దీపక్ అన్నా " అంది సీత.
" ముదిరిపోయారు ..... ఈ కాలం చిన్న పిల్లలు .. సినిమాల ప్రభావం , సరిగ్గా line వేసుకుందామన్నా అందరూ పట్టెస్తారు.. అమెరికానే బెటరు , మన సినిమా ట్రిక్స్ అన్నీ తెల్ల అమ్మాయిల పైన ప్రయోగించొచ్చు. " మనసు లో స్టెల్లా Date గుర్తుకు వచ్చింది దీపక్ కి "
" జోక్స్ ఆపి పదండి , విజయ్ మనం వెల్దాం.. and all of you , get ready for operation hack-day"

********************************************

" మూర్తి గారు మీరు ఏంచేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం ఆ స్థలం కావాలి, మీ వాడు కూడా వాళ్ళ friends తొ కలిసి అనవసరమైన విషయాలలో తల దూరుస్తున్నాడు , అది అతనికి , మీకు మంచిది కాదు, మీ వాడికి కాస్త చెప్పండి,,, " ఖాన్‌ మాటలు కృష్ణ మూర్తి గారు జాగ్రత్తగా వింటున్నారు ..

*********************************************

ఆ రోజు రాత్రికి ఎవ్వరూ నిద్ర పోలేదు.. అందరికి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు గుహ దగ్గరికి వెళ్దామా అనే వుంది . ఒక్క దీపక్ మాత్రం స్టెల్ల కి Morning కాల్ చేసి , గాయత్రి గురుంచి అలోచిస్తూ మెల్లగా , హాయిగా, నిద్ర పోయాడు ...
....

తెల్లవారగానే అందరు చక్కగా తయారై , లోకేష్ తెచ్చిన కిట్ తొ బయలు దేరారు . గుహ లోకి మెల్లిగా నడవటం ప్రారంభించారు. వెలుతురు బాగా పెరగటంతో గుహ ద్వారం చాలా క్లియర్ గా ఉంది. దీపక్ నిన్న చూసిన paintings బాగా కనిపిస్తున్నాయి. అవి ఏవో కొండ ప్రాంతం వాళ్ళవి లాగా వున్నాయి..అందరూ మెల్లిగా లోకేష్ ని follow అవుతూ వెల్తున్నారు.. మెల్లిగా గుహ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి పెరగటంతో ,లోకేష్ focus light వేసాడు. అంతే , గుహ అవతలి నుంచి ఎవరో దానికి return చేసినట్లుగా మరలా ఆ light reflect అయ్యింది.

" విజయ్ , అక్కడ ఏదో వున్నట్లుంది , తొందరగా పదండి " లోకేష్ తొందరపెట్టాడు...

అక్కడ చూసిన దృశ్యాన్ని వాళ్ళు జీవితంలో ఎప్పటికి మర్చిపోరు. బంగారం రంగులో ఒక చిన్న రాయి శివలింగం ఉంది. దాని మీద పడిన light అన్ని వైపులా ప్రసరించి ఆదిత్యా 369 సినిమాలో శ్రీ కృష్ణ దేవరాయలి వజ్రం లాగా ఉంది. అందరూ చాలా సీపు ఆ దృశ్యాన్ని అలా చూస్తూనే ఉండి పోయారు. దీపక్ కూడా గాయత్రిని పక్కన ఉంచుకుని అలా ఉండి పోవటం ఊలపల్లి వచ్చిన తర్వాత ఇదే first time.

ఇంతలో

" బావా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. " అంటూనే సీత వెన్నక్కి వాలి పోయింది. అందరు ఒక్క సారి తిరికి సీత వైపు చూసారు.
" లోకేష్ , చూడు ఎమైందో , దీపక్ నువ్వు కూడా రా ఇటు , " అన్నాడు మధు.

లోకేష్ సీత చెయ్యి పట్టుకొని చూసి , " ఖంగారు ఎమీ లేదు . గుహ కదా ఇది, సరిగ్గ ventilation లేక కళ్ళు తిరికి ఉంటాయి, కొంచం నీళ్ళు ఉంటె, మొహం మీద చల్లితే సరిపోతుంది . దీపక్ ఆ బాటిల్ ఇవ్వు "
" నాకు , అంతే ఉంది " , ఈ సారి గాయత్రి అంది.
" అవునా,, అయితే తొందరగా పదండి మనం వెనక్కు వెలదాము. మన వాళ్ళకి కొంచం fresh air కావాలి" లోకేష్ తొందర పెట్టాడు.
అందరు ఏమి ఆలోచించకుండా, సీతను పట్టుకొని బయటికి వచ్చేశారు.
" విజయ్ , ఆ రాయి ని ఒక్క photo తీసుకొని రా , "

అలా అందరు బయటికి వచ్చేసారు. సీతకి మెలుకు వచ్చింది.
" గాయత్రి, నీకు ఎమ్మన్నా తెలుసా , ఆ రాయి గురించి. " లోకేష్ అడిగాడు.
" లేదు లోకేష్ .. " గాయత్రి సమాధానం చెప్పింది.