Thursday, June 30, 2005

Chapter 25

మధు, విజయ్ మిద్దె పైకి వెళ్ళారు। అప్పటికే అక్కడ లోకేష్, దీపక్ ఉన్నారు। వీళ్ల వెంబడే ప్రభాకరం, శశికళ కూడా పైకి చేరారు। సూర్యం ఓ పక్కగా ఏదో అలోచనలో నిమగ్నమయ్యున్నాడు। అందరి చూపులూ మిద్దె పైనున్న అందరినీ ఒక్కక్కరిగా పరికించాయి। కొందరి చూపులో అయోమయం, కొందరి చూపులో జాలి, కొందరి చూపులో బాధ, కొందరి చూపులో బెదురు, కొందరి చూపులో తప్పుచేశామన్న వేదన॥॥ ఎవ్వరికీ ఏమిటీ అర్థం కావటం లేదు। అసలు అక్కడ ఎందుకు చేరారో, ఎవరు రమ్మన్నారో కూడా తెలియదు। అందరినీ అక్కడికి రమ్మని చెప్పింది మాత్రం సీత। ఇంతలో సీత చలాకీగా మధ్యలో కి వచ్చింది। చేతిలోని వార్తా పత్రికని గట్టిగా చదవటం మొదలెట్టింది। హెడ్ లైన్స్ కింద ఏదో రోడ్డు ప్రమాదం గురించిన వార్త ఉంది।

"నిన్న అర్థ రాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి నుంచి ఊలపల్లి వచ్చేదారిలో ఒక జీపుని, ఇసుక లారీ ఢీకొని ఘోర ప్రమాదం సంభవించింది। జీపు పూర్తిగా దెబ్బతింది। ప్రమాదంలో ఒక ప్రాణ నష్టం జరిగింది। మిగిలినవారు కొన ఊపిరితో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। చనిపోయిన వ్యక్తి, పలు చీటింగ్ కేసులలో నిందితుడు, real estate మాఫియా లీడర్ గా చెలామణి అవుతున్న "జెలగలపూడి పిచ్చయ్య" అలియాస్ "జెపి" అని తెలిసింది"


ఇంతలో కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద అడుగులతో అందరి మధ్యకీ వచ్చాడు। ఆయన ముఖంలో అదో తెలియని భావం కనిపించింది। పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ఏదో పెద్ద బరువుని దింపుతున్నట్టుగా ఆయన మాట్లాడ్డం మొదలెట్టారు


"మీ అందరికీ ఇవాళ నేనో విషయం చెప్పాలి। గత కొన్ని రోజులుగా మీరందరూ గురైన మనోవేదనకు ముఖ్య కారకుడిని నేనే !!!!!"


అందరి ముఖాల్లో ఆశ్చర్యం॥॥। ఆ వెంటనే అది కోపంగా మారబోతోంది। ఆయన మాటలు ముందుకు సాగాయి।

"అయితే, ఎన్నో రోజులుగా నేను కూడా ఇంతకన్నా ఎక్కువగా రగిలిపోయాను। అది ఒక విధంగా స్వయంగా కొని తెచ్చుకున్నదే। ఇందాక సీత చదివిన వార్తతో దీనికి సంబంధం ఉంది। చనిపోయిన ఆ జెపి చేతిలో నేను నరకయాతనకు గురయ్యాను। నేను రెండేళ్ల క్రితం చేసిన ఒక తప్పుకి తగిన ఫలం అనుభవించాను। నా ఆసుపత్రి విషయంలో స్వార్థం కోసం, డబ్బు కోసం శరీర అవయవాల వ్యాపారం చేశాను। మా ఆసుపత్రి ఉన్న స్థలానికి సరైన కాయితాలు లేకపోతే, వాటిని కప్పిపుచ్చటానికి జెపి ని ఆశ్రయించాను। ఆ సమస్య గట్టెక్కినా, నా వ్యాపారంలో వస్తున్న డబ్బు చూసి, జెపి నన్ను black mail చేయడం మొదలుపెట్టాడు। వాడి కన్ను మనూరిలోని రాతిస్తంభం ఆ చుట్టు పక్కల స్థలాల మీద పడింది। ఇక్కడ మొన్న తవ్వకాలలో బయట పడిన కొన్ని పురాతన వస్తువులే దానికి కారణం। వాటిని ఇతరదేశాలలో అమ్మి చాలా డబ్బు చేసుకుందామని, ఆ స్థలాలు చాలా మట్టుకు ప్రభాకరం గారి కుటుంబం ఆస్తి అని తెలుసుకుని, నా చేత ఇంత నాటకం ఆడించాడు। ఇది ఇంతవరకూ రావడం నా తప్పే। అయితే ఇప్పుడు వాడి పీడ విరగడయ్యింది। నీలూకి ఏ జబ్బూ లేదు। మా వాడు అమెరికా నుంచి రావడం కూడా నా మూలంగానే। అయితే, ఈ దీపక్ సంగతి మాత్రం నాకు తెలియదు। " అని భోరుమన్నాడు కృష్ణమూర్తి।


అందరికీ ఇప్పుడిప్పుడే పరిస్థితి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది। లోకేష్ అందుకుని,"మా నాన్న నీలుకి dementia అని చెప్పినప్పుడే నేను ఏదో తేడా ఉందని గ్రహించి, దీపక్ తో ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి హడావుడి చేశాను। ఇందులో మీ మనసుల్ని కష్ట పెట్టుంటే క్షమించండి"।


"అవును, లోకేష్ నాతో, ఏదో తిరకాసు ఉంది, కాస్త సహకరించమంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను" అని లోకేష్ ని సమర్ధించింది నీలు।

విజయ్ ఒక్కసారి "హమ్మయ్య" అనుకున్నాడు।

శశికళ "నా కూతురే దొరికిందా ఈ నాటకాలకి, ఇప్పుడు దానికి పెళ్లెలా అవుతుంది?" అన్నారు ఆవేదనగా॥॥॥।


"నువ్వూరుకోవే, మనమ్మాయికి ఏ రోగం లేదని, గండం గడిచిందని ఆనందించక, పెళ్ళో అని మళ్లీ ఆ ఏడుపు మొదలెట్టకు॥॥॥" ప్రభాకరం ఓదార్చారు।


"అమ్మా॥॥॥। మళ్లీ పెళ్లి మాటేమిటే, ఇంకో సంవత్సరం దాకా అసలా మాటే ఎత్తొద్దు నాతోటి" అని మెట్లు దిగి వెళ్లి పోయింది నీలు।


విజయ్, మధు ఒకరినొకరు చూసుకున్నారు।
లోకేశ్, దీపక్ కూడా ఒకరినొకరు చూసుకున్నారు।


(శ్రీహర్ష , 17/08/05, సశేషం)

Chapter 26

ఎవరింటికి వాళ్ళు చేరుకున్నారు.
కృష్ణమూర్తి గారు ఇచ్చిన షాక్ నించి అంతా ఇంకా తేరుకోలేదు.

అర్ధరాత్రి దాటింది.
లోకేష్ మనసులో మాత్రం వేరే అలోచనలు మెదులుతున్నాయి.
సడెన్ గా అందరికీ ఫోన్ చేసి ఇంటికి రమ్మనాడు.
10 నిమిషాలలో విజయ్,మధు,నీలు,దీపక్,లోకేష్ సమావేశమయ్యారు.

లోకేష్ మొదలు పెట్టాడు.
"JP చనిపోయాడు, కానీ ఆ రాతి మండపం ఇంకా అలాగే ఉంది."
"ఒక పెద్ద మాఫియా లీడర్ ఈ పని చేశాడు అంటే, అక్కడ చాలా పెద్ద నిధి ఉండి ఉండాలి."
"లంకెల బిందెలా ?" అడిగాడు దీపక్
"తెలీదు,కానీ ఊహకందేలా ఉంది ప్రమాదం."
"కరెక్ట్ గా చెప్పావు లోకేష్, JP తో పాటు ఈ విషయం వేరే వాళ్ళకి కూడా తెలుసు, మనమంతా మన మన ఊళ్లకి వెళ్లిపోతే, మన ఇంట్లో వాళ్లకి ప్రమాదం,వాళ్ళు ఏమన్నా చెయ్యొచ్చు!" అన్నాడు విజయ్.

"ఐతే మనం ఏం చెయ్యాలి ?" కంగారుగా అడిగాడు మధు.
"నాన్నగారి మీద ఇంత ప్రెజర్ ఎందుకు పెట్టారో,అక్కడ ఏముందో మనం తెలుసుకోవాలి."
అన్నాడు లోకేష్ భారంగా నిట్టూరుస్తూ ఒక్కసారి నాన్నగారిని తలచుకుని.

ఒక్క నిమిషం, నా ఫ్రెండ్ గాయత్రి హైదరాబాద్ లో అర్కియాలజి డిపార్టమెంట్లో వర్క్ చేస్తుంది.
ఆమె ప్రస్తుతం చెన్నై లో ఉంది, she is doing some excavations" చెప్పింది నీలు.
"excavations అంటే ?" అడిగాడు దీపక్,
"ఉత్ఖాతనములు" చెప్పాడు లోకేష్.
"ఏంటో, మీరు ఒక్క విషయం కూడా సరిగ్గా చెప్పరు,వచ్చాక ఆ అమ్మాయినే అడుగుతాలే !" నెమ్మదిగా అనాడు దీపక్.
"ఇంకో విషయం, ఈ విషయం ఇంట్లో గాని బయట గాని తెలియకూడదు, సీక్రెట్ గా ఉంచుదాం." అన్నాడు లోకేష్.
"ఐతే, మన తక్షణ కర్తవ్యం ?" అడిగాడు మధు.
"మనం రేపు రాతి మండపం దగ్గర కాసేపు సమయం గడుపుదాం, ఏదో వెతుకుతున్నట్టు ఉండకూడదు" అన్నాడు లోకేష్.
"వన భోజనాలు ? " చిన్నగా నవ్వుతూ అంది నీలు.
"thats a cool idea" అన్నాడు విజయ్.
"okay, రేపు రాతి మండపం దగ్గర వనభోజనాలు, లోకేష్ పాక శాస్త్ర ప్రావీణ్య ప్రదర్శన ! " అన్నాడు దీపక్.
"సై !" అన్నాడు విజయ్.

సై అన్నారంతా !

* * * * * *



"JP accident లో చనిపోలేదు."
"మరి ?"
"మర్డెర్ అది."
"నీకు ఎలా తెలుసు ?"
"ఇసుక లారి ఆ రూట్లో వెళ్లదు,బై-పాస్ రూట్లో వెళ్తుంది,పక్కన ఉన్న టీకొట్టులో ఎంక్వైరీ చేశాను,ఆ రాత్రి చాలాసేపు లారీ అక్కడ ఆగి ఉందట."
"JP ఆ దారిలో వస్తున్నాడని ఎవరికైనా తెలుసా ?
"ఖాన్ కి తెలుసు, కానీ ఖాన్ చాల నమ్మకస్తుడు,మనం డౌట్ పడలేం"
"ఎవర్ని నమ్మగలం నర్సింగ్ ? ఆ రాతి మండపం మన వశం ఐతే,డబ్బులే డబ్బులు."
"అవును,అది గాని మనకు దొరికితే,ఈ చిన్నా చితకా వ్యాపారలన్నీ మానేసి ద నర్సింగ్స్ అని పెద్ద హోటెల్ పెడతా ద సచిన్స్ లాగ !"
"ఎదో రకంగా మనం సొంతం చేసుకోవాలి"
"అదే , ఎలా ?"
"బెదిరించో,బయపెట్టో,మంత్రించో,మంచం పట్టించో ..."
"JP కి ఉన్న కాంటాక్ట్స్ మనకు లేవు"
"అది నిజమే,ఖాన్ని రానీ,వాడు పెద్ద ఖిలాడి!"

(సశేషం - కళ్యాణ్ ,కాకినాడ)

Chapter 27

/******************************************************/

University of Madras. Archaeology Department. Office of the H.O.D.
మంగళవారం ఉదయం. తొమ్మిది గంటలు.


"May I come in, Sir?"
"హలో గాయత్రీ, నన్మంగళం excavation details నోట్ చేసుకున్నావా?"
"పూర్తైందండీ, రిపోర్ట్ మధ్యాహ్నం submit చేస్తాను."
"గుడ్."
"ఇంకో విషయమండీ..."
"చెప్పు. దయచేసి సెలవు కావాలని మాత్రం అనకమ్మా. అసలే University లో ఎవరూ లేరు."
"..."
"సెలవేనా? ఇక పనులయినట్లే."
"మా ఫ్రెండ్స్ పిలిచారండీ."
"సరే, సరే, ఎన్నిరోజులు కావాలి?"
"సోమవారానికి వచ్చేస్తాను"
"మూడురోజులన్నమాట, ఇంతకీ ఎక్కడ కలుస్తున్నారంతా?"
"ఊలపల్లి అని ఒక పల్లెటూరుందిలెండి"
"సరే మరి, సోమవారం అన్నమాట, జాగ్రత్తగా వెళ్లిరా"
"వస్తానండీ", గాయత్రి బయలుదేరింది.
"బై", గాయత్రి బయటికెళ్లేంత వరకూ ఆగి, చెమటపట్టిన చేత్తో, ప్రొఫెసర్ షౌకత్ ఆలీ ఖాన్ ఫోనందుకున్నాడు.

/********************************/

ఊలపల్లి రచ్చబండ. మంగళవారం సాయంత్రం. ఏడు గంటలు.

నీలు, సీత బస్సు ఆగటం చూసి ముందుకు కదిలారు.
లోకేష్, గాయత్రి బస్సు దిగారు.
"ఒసేవ్, ఏంటే సంగతి, పోలవరం నుండి ఈ ఎస్కార్ట్ ఏమిటి? ఏం జరుగుతోంది?"
"అన్నీ తెలుస్తాయిగానీ ముందు ఇంటికి పదవే, సీత గుర్తుందా?"

/********************************/

పోలవరం బస్ స్టేషన్. మంగళవారం రాత్రి. ఎనిమిదీ ఇరవై.

ఇంకా ఓమోస్తరుగా జనాల హడావిడి కనిపిస్తోంది.

"రేయ్, చీకటి పడినప్పటినుంచీ ఇక్కడే పడున్నాం, గాయత్రి వాళ్ల బస్సు కూడా వెళ్లిపోయింది"
"ఇంకొక గంట ఆగుదాం మధూ, వీళ్లు రావాలే..."
"నేనొక జామకాయ కొనుక్కొచ్చుకుంటా అయితే."
"నీ ఇష్టం, కానీ ఎక్కువమందికి కనపడకుండా వెళ్లు. పదో కాయా ఈరోజు? "
"కౌంట్ ఆ ప్రాంతాల్లోనే ఉంది. అసలు జీవితం జామకాయ వంటిది, స్నేహితులు లోపలి గింజల వంటివారు, కాలం వచ్చినప్పుడు ఒక పురుగు..."
"బాబూ, నీ వెధవ ఉపమానాలు ఆపుతావా, భార్యకీ పురుగుకీ పోలికా?"
"అర్థమవ్వాలంటే కష్టమేలే, వివరిస్తా చూడు, వింటరెస్టింగ్ గా ఉంటుంది"
"అక్కర్లేదు"
"ఇదిగో, ఈ మొహమాటమే నాకిష్టముండదు, కేనోపనిషత్తులో ఈ విషయాన్ని రమ్యంగా... రేయ్ రేయ్ అటు చూడు!"
గోపాలుడు, కృష్ణమూర్తి ఫోన్ బూత్ వైపు వెళ్తున్నారు.
"ఇదేంట్రా, వీళ్లెప్పుడు వచ్చారసలు?"
"సాయంత్రమే వచ్చి మనలాగే ఎక్కడో ఆగి ఉంటారు. వీళ్లుగానీ బస్సులో వచ్చి ఉంటే మనకు తెలిసేది. మూర్తిగారి బైక్ మీద వచ్చారేమో. దీపక్ కి సిగ్నల్ ఇస్తానుండు."
ఐదు నిమిషాలు గడిచాయి. గోపాలుడు ఫోన్ ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టాడు.
"రేయ్, అటువైపు నుండి కాల్ వచ్చిందా? వీళ్లు డయల్ చేయటం కనబడలేదే"
"అలాగే ఉంది."
"మూర్తిగారు మాట్లాడుతున్నారు ఇప్పుడు..."
"మధూ, ఇక ఇక్కడ పని అయిపోయింది. పద."
బైనాక్యులర్స్ తీసుకుని ఇద్దరూ వాటర్ టాంక్ పైనుండి కిందికి దిగారు.
దీపక్ ఒక రెండు నిముషాల్లో అక్కడికి చేరుకున్నాడు, "number tap చేశాను, area code 44 ఎక్కడ?"
"చెన్నై", ఇద్దరూ ఒకేసారి అన్నారు, "రేయ్, దాన్ని రివర్స్ లుకప్ చేద్దామాగు, దీపక్, number ఒకసారి చెప్పు", మధు number నోట్ చేసుకుని
ఫోన్ తీసుకుని పక్కకి వెళ్లాడు.
విజయ్, దీపక్ టీ ఆర్డర్ చేశారు.
"దీపక్, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు?"
"64 కళల్లో ఒకటని ఎవరో అంటేనూ, పసివయసులోనే పట్టేశాను."
"సీమసింహం సినిమాలో వండర్ బాయ్ టైపన్న మాట"
"లైట్ గా, yeah"
"రేయ్, number తెలిసింది. ఆ కాల్ Madras University, archaelogy department office నుంచి వచ్చింది."
"అదేంటి! గాయత్రి అక్కడి నుంచే కదా వస్తోంది? కొంపదీసి రింగ్ లీడర్ ఆమేనా ఏంటి? ఆమె పైన అసలే పవిత్రమైన ప్రేమ పెంచేసుకున్నాను"
"తొలిచూపు కూడా పడకముందే? మధూ, వాళ్లు అతిజాగ్రత్తతో ఒక పావుగంటైనా ఆగి బయలుదేరుతారు, jeep start చెయ్యి, వెంటనే ఊలపల్లి వెళ్లాలి"
టీ అక్కడే వదిలి స్టేషన్ వైపు చూస్తూ వేగంగా వెళ్లిపోయారు ముగ్గురూ.

/*****************************************/

విజయ్ - తిరుపతి - 9/10/2005 - సశేషం

Chapter 28

ఆ రాత్రికి నీలు వాళ్ల ఇంట్లో గాయత్రి బస।
అప్పటిదాకా జరిగిన విషయం అంతా నీలు గాయత్రికి చెప్పింది। అంతా చెప్పి,
"గాయత్రీ, నిజంగానే ఆ రాతి మండపంలో ఏమయినా ఉంటుందంటావా??"
"ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, చెయ్యిపెడితేనేగా తెలిసేది"
"సర్లేవే, నీ పరిహాసం నువ్వూనూ.. , అసలు ఇన్నేళ్లు గా ఎవరికీ దొరకనిది అక్కడ ఉందంటే, నాకు నమ్మబుద్ధికావట్లేదు" ట
"'ఇప్పటిదాకా ఎవరికీ దొరకలేదు కాబట్టి, అక్కడ ఏదీ లేదు' అన్నది archaeology ఖండిస్తుంది। అసలు మా వాళ్లు ఏమంటారంటే..."
"అమ్మా తల్లీ, ఒప్పుకున్నాలేవే, ఇక పెద్ద క్లాసు పీకద్దు॥। నీతో చెప్పాను చూడు॥॥। చిన్నప్పుడు నుంచి ఎన్ని సార్లు దొరికిపోయానో....."
"అంత మరీ పీక్కుతింటానే నేను నా analysis తోటీ, పరిశీలనా దృష్టి తోటీ....."
"అయినా పండగపూట కూడా పాత మొగుడేనా, అన్నట్లు, ఇప్పుడు కుడా నేనే ఎందుకే, రేపు చూపిస్తాగా, నీకోసం కొత్త బకరాలు ఉన్నారులే, వాళ్లని ఓ చూపు చూద్దువుగానీ..."
ఇంతలో సీత వచ్చింది,"ఏంటి మా బావా వాళ్ల గురించేనా, గాయత్రక్కా నీకు మంచి పోటీ కూడా అవుతారులే..."
"ఏంటే ఇద్దరు తెగ introduction ఇచ్చేస్తున్నారు..."
అంతా నవ్వుకుని, రేపు పొద్దున్న రాతి మండపం దగ్గర వనభోజనాలు, ఆ ముసుగులో తవ్వకాలు తలుచుకుంటూ పడుకున్నారు।


/**************************/
పొద్దున్న అంతా రాతి మండపం చేరుకున్నారు।
"రాగానే పని మొదలెడితే, మరీ బావుండదేమో...", నీలు సామాన్లు సర్దుతూ అంది।
"అబ్బే ఇప్పుడేగా ఇడ్లీలు తిన్నది, తొందరేం లేదులే" అన్నాడు లోకేష్॥
"ఛా, ఎప్పుడూ తిండి గోలే, అమెరికా వెళ్లి చెడిపోయారు బొత్తిగా" అంది సీత ఎగతాళిగా

"కాసేపు ఏదయినా సరదా చెయ్యొచ్చుగా అక్కా, ఇంతలో పక్కూరునించి మా బావ వాళ్లు కూడా వస్తారు" సీత పొడిగించింది।
"సరే, మేము కాలేజీలో ఏవో పిచ్చి పిచ్చి ప్రాసలతో వాక్యాలు అల్లేవాళ్లం, భలే కవితలు పుడతాయి, ఆడుదామా.." నీలు సలహా పారేసింది।

గాయత్రి మొదలుకూడా పెట్టేసింది...।
"తళ తళ లాడే రిన్ తెలుపు"
అంతలోనే, వచ్చారు మధు, దీపక్, విజయ్।
మధు వెంటనే, "ఏంటి, ఏదో జరుగుతోందిక్కడ, మాకు తెలియాలి, తెలియాలంటే తెలియాలి॥॥।"
"ఊరికే చెవికోసిన మేక లాగా అరవకు బావా... ఆటాడుతున్నాం, నువ్వు కూడా చేరు.."
గాయత్రి అక్క మొదలుపెట్టింది। ప్రాసతో ఏది తోస్తే అది..."
ఇదుగో ఇది "తళ తళ లాడే రిన్ తెలుపు"
"నిగ నిగ లాడే మా మధు నలుపు", విజయ్ అందుకున్నాడు
"తిప్పండి నాయనా ఈ ఆటని ఒక మలుపు", నీలు కొనసాగించింది
ఎలాగయినా గాయత్రిని impress చేయాలని దీపక్,
"ఎంతో గట్టిది మా ఇంటి తలుపు"
"దీపక్, ఇంతకీ అసలు సంగతి తెలుపు", hint ఇచ్చాడు మధు
రెచ్చిపోయి, దీపక్, "గాయత్రీ, నీపై ఎంతో కలిగింది వలపు"
"దీపక్, నీకు కొంచెం ఎక్కువయ్యింది బలుపు", గాయత్రి ఘాటుగా విసిరింది
"గాయత్రీ, నీ అవేశం కొంచెం నిలుపు", నీలు అంది
లోకేష్ ఏదయినా చెప్పాలని ఉబలాట పడిపోతున్నాడు...
"సాంబారులో కాస్త ఎక్కువయ్యింది పులుపు"
ఛ, మళ్లీ తిండి గోల,
"లోకేష్, నువ్వు పప్పులో నెయ్యి బాగా కలుపు"
"ఎంత కష్టించినా లేనే లేదు మాకు అలుపు", రాత్రి జీపు ప్రయాణం తలుస్తూ విజయ్
"ముద్దులొలుకు సీతేగా మా ఇంటి ఇలవేలుపు", మధు అన్నాడు।
సీత మొహం వెలిగిపోయింది।
"ఈ ఆటలో నాదే నాదే గెలుపు" సీత గెంతుతూ చెప్పింది।
"అసలు సంగతి ఏమనగా, చెన్నయ్ వెళ్లింది పిలుపు", మధు విప్పాడు విషయాన్ని!!!
గాయత్రీ, నీలు, లోకేష్ లకి అర్థం కాలేదు విషయం। "అంటే"??? అన్నారు వాళ్లు ముగ్గురూ ఒక్కసారిగా...

సీత కాళ్ల కింద ఏవో బాగా అరిగిన తెలుగు అక్షరాలు లాగా కనిపిస్తున్నాయి॥॥॥

"రాజులు రారాజులు పొందగ వచ్చెను
దొంగలు గజదొంగలు దోచగ సొచ్చెను
చిక్కదు ఆశాపరులను
మిక్కిలి అశూయాపరులను
అది వెలసెను లోక కల్యాణమునకు
కాని అదె కారణము ప్రళయమునకు"

శ్రీహర్ష (16-Sep-05)