Sunday, June 29, 2008

Chapter 38 - బొమ్మ రహస్యం

/***************************************************************/

"ఇదిగో ఫొటో", డిజిటల్ కెమెరాలో ఆ లింగాన్ని జూమ్ చేసి గాయత్రికి అందించాడు విజయ్.
"ఈ సింబాలజీ నేను సౌత్ ఇండియాలో ఎక్కడా చూడలేదు. శివలింగం ఇలా ఉండే ఆలయాలు మామూలుగా ఆగ్రా చుట్టుపక్కల ఉంటాయి", చాలా సేపు చూసి చెప్పింది గాయత్రి.
"ఒరే లోకిగా, నాకు ఇదంతా ఒక సెటప్ లా అనిపిస్తోందిరా. మనల్ని దారి మళ్లించటానికి, రాత్రికి రాత్రి లింగాన్ని స్థాపించారేమో అని డౌట్ వస్తోంది", అన్నాడు దీపక్.
"అంటే, ఆ గుహలో ఇంకా ఇంపార్టెంట్ క్లూ ఏదో ఉందంటావా?", అడిగాడు మధు.
"అవును. ఆ లింగం ఆ రేంజ్ లో గ్లేర్ కొడుతోందంటే అది fake అయ్యుండటానికే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడే వస్తా", టార్చ్ తీసుకుని లోపలికి పరుగెత్తాడు దీపక్.
అందరూ ఫొటోని మరింత తీవ్రంగా చూడసాగారు.

/***************************************************************/

"ఖాన్ గారూ, నేను ఇప్పటికే చాలా ఇరుక్కుపోయాను. కానీ , నేను చేయగలిగింది ఏమీ లేదు. వాడు వాడి ఫ్రెండ్స్ తో చేసే పనులను ఆపటం నా చెయ్యి దాటిపోయింది. నా నుంచి మీరు ఇక ఏ సహాయాన్నీ ఆశించకండి. ఒక వేళ నేను మీ ఒత్తిడికి లొంగి ఏం చేసినా అది మీ వ్యవహారాలు ఇంకా బయటికి పొక్కేలా చేస్తుంది", అని ఖాన్ కి తన పరిస్థితి వివరించాడు మూర్తి.
ఇక ఇక్కడ వచ్చే లాభం ఏదీ లేదని ఖాన్ కి అర్థమైంది.
"సరే నీ ఇష్టం. కానీ ముందు ముందు నేను చేసే పనుల వల్ల మీ వాళ్లకి నష్టం జరగదని నేను హామీ ఇవ్వలేను", అని వేగంగా బయల్దేరాడు ఖాన్.
"ఖాన్..., ఖాన్...", ఆఖరిసారి ప్రాధేయపడటానికి ఖాన్ వెనకే బయటికి వస్తున్న మూర్తికి తన ఇంటి వైపే గోపాల్, నర్సింగ్ రావటం కనపడింది.

/***************************************************************/

"రత్నా fancy సెంటర్, పోలవరం", పీక్కొచ్చిన శివలింగం కింది సైడ్ అందరికీ చూపించాడు దీపక్.
"ఓరెదవల్లారా!", అరిచాడు మధు.
"hmm, అయితే లోపల మనం వెతకాల్సింది ఇంకా ఉందన్న మాట", నిట్టూర్చింది నీలూ.
అందరూ గుహలోకి వెళ్లారు.

/***************************************************************/

తన వెనకే వస్తున్న మూర్తిని పట్టించుకోకుండా గోపాల్, నర్సింగ్ లతో కారెక్కాడు ఖాన్.
"మీరు చెప్పినట్లే అక్కడ వెతికాం బాస్. రాత్రంతా వెతికితే కానీ map కనపడలేదు. ఫొటోస్ ఇవిగో"
"గుడ్. శివలింగం పెట్టారా?"
"పెట్టాము. కానీ..."
"కానీ?"
"ఆ map ని మేము destroy చేయలేకపోయాము. అంటే, అది మామూలుగా లేదు"
"hmm, సరే, ముందు హైదరాబాద్ వెళ్దాం పదండి", కెమెరా జేబులో పెట్టుకుని, కళ్లు మూసుకున్నాడు ఖాన్.

/***************************************************************/

Thursday, November 29, 2007

Chapter 37 -రహస్యం

"నీ మొహం !!, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, వాళ్ళ కోసం పని చేసే అవసరం ఎవరికి వుంటుంది..." గాయత్రి అంది.
అప్పటి దాకా కష్టపడి పెంచుకున్న image ఒక్కసారి పడిపోవటంతో కొంచం నొచ్చుకున్నా వెంటనే తేరుకొని
" లోకేష్, మీ నాన్న గారు ఇంకా ఎదో దాస్తున్నారు అనిపిస్తోంది, ఇప్పుడు మనల్ని follow అవుతున్నారు అంటే మనం ఇంకా జాగ్రత్తగా వుండాలి. నీకు ఎమన్నా అనుమానమా ,,," అన్నాడు దీపక్ ..
" అవును రా ...నాకూ ఏదో దాస్తున్నారు అనే అనిపిస్తోంది, ఆ విషయం తర్వాత చూద్దాం కాని , ఇప్పుడు మాత్రం అందరు ఎమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోదాము, ఎవరూ తల తిప్పి కూడా చూడద్దు , జాగ్రత్తగా నటించి మనం వన భోజనాలకి వచ్చి నట్లు వెళ్ళి పోదాము. రేపు పొద్దున్నే వచ్చి ఈ గుహ సంగతి చూద్దాం. మనకి కావలసిన వస్తువులు, నేనూ దీపక్ వెళ్ళి పోలవరం లో తెస్తాం. "



" లేదురా , నువ్వు విజయ్ ని తీసుకొని వెళ్ళు, నేను సీత వాళ్ళకి తోడుగా వెళ్తాను .. "
" అసలు విషయం మాకు తెలుసు లే దీపక్ అన్నా " అంది సీత.
" ముదిరిపోయారు ..... ఈ కాలం చిన్న పిల్లలు .. సినిమాల ప్రభావం , సరిగ్గా line వేసుకుందామన్నా అందరూ పట్టెస్తారు.. అమెరికానే బెటరు , మన సినిమా ట్రిక్స్ అన్నీ తెల్ల అమ్మాయిల పైన ప్రయోగించొచ్చు. " మనసు లో స్టెల్లా Date గుర్తుకు వచ్చింది దీపక్ కి "
" జోక్స్ ఆపి పదండి , విజయ్ మనం వెల్దాం.. and all of you , get ready for operation hack-day"

********************************************

" మూర్తి గారు మీరు ఏంచేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం ఆ స్థలం కావాలి, మీ వాడు కూడా వాళ్ళ friends తొ కలిసి అనవసరమైన విషయాలలో తల దూరుస్తున్నాడు , అది అతనికి , మీకు మంచిది కాదు, మీ వాడికి కాస్త చెప్పండి,,, " ఖాన్‌ మాటలు కృష్ణ మూర్తి గారు జాగ్రత్తగా వింటున్నారు ..

*********************************************

ఆ రోజు రాత్రికి ఎవ్వరూ నిద్ర పోలేదు.. అందరికి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు గుహ దగ్గరికి వెళ్దామా అనే వుంది . ఒక్క దీపక్ మాత్రం స్టెల్ల కి Morning కాల్ చేసి , గాయత్రి గురుంచి అలోచిస్తూ మెల్లగా , హాయిగా, నిద్ర పోయాడు ...
....

తెల్లవారగానే అందరు చక్కగా తయారై , లోకేష్ తెచ్చిన కిట్ తొ బయలు దేరారు . గుహ లోకి మెల్లిగా నడవటం ప్రారంభించారు. వెలుతురు బాగా పెరగటంతో గుహ ద్వారం చాలా క్లియర్ గా ఉంది. దీపక్ నిన్న చూసిన paintings బాగా కనిపిస్తున్నాయి. అవి ఏవో కొండ ప్రాంతం వాళ్ళవి లాగా వున్నాయి..అందరూ మెల్లిగా లోకేష్ ని follow అవుతూ వెల్తున్నారు.. మెల్లిగా గుహ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి పెరగటంతో ,లోకేష్ focus light వేసాడు. అంతే , గుహ అవతలి నుంచి ఎవరో దానికి return చేసినట్లుగా మరలా ఆ light reflect అయ్యింది.

" విజయ్ , అక్కడ ఏదో వున్నట్లుంది , తొందరగా పదండి " లోకేష్ తొందరపెట్టాడు...

అక్కడ చూసిన దృశ్యాన్ని వాళ్ళు జీవితంలో ఎప్పటికి మర్చిపోరు. బంగారం రంగులో ఒక చిన్న రాయి శివలింగం ఉంది. దాని మీద పడిన light అన్ని వైపులా ప్రసరించి ఆదిత్యా 369 సినిమాలో శ్రీ కృష్ణ దేవరాయలి వజ్రం లాగా ఉంది. అందరూ చాలా సీపు ఆ దృశ్యాన్ని అలా చూస్తూనే ఉండి పోయారు. దీపక్ కూడా గాయత్రిని పక్కన ఉంచుకుని అలా ఉండి పోవటం ఊలపల్లి వచ్చిన తర్వాత ఇదే first time.

ఇంతలో

" బావా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. " అంటూనే సీత వెన్నక్కి వాలి పోయింది. అందరు ఒక్క సారి తిరికి సీత వైపు చూసారు.
" లోకేష్ , చూడు ఎమైందో , దీపక్ నువ్వు కూడా రా ఇటు , " అన్నాడు మధు.

లోకేష్ సీత చెయ్యి పట్టుకొని చూసి , " ఖంగారు ఎమీ లేదు . గుహ కదా ఇది, సరిగ్గ ventilation లేక కళ్ళు తిరికి ఉంటాయి, కొంచం నీళ్ళు ఉంటె, మొహం మీద చల్లితే సరిపోతుంది . దీపక్ ఆ బాటిల్ ఇవ్వు "
" నాకు , అంతే ఉంది " , ఈ సారి గాయత్రి అంది.
" అవునా,, అయితే తొందరగా పదండి మనం వెనక్కు వెలదాము. మన వాళ్ళకి కొంచం fresh air కావాలి" లోకేష్ తొందర పెట్టాడు.
అందరు ఏమి ఆలోచించకుండా, సీతను పట్టుకొని బయటికి వచ్చేశారు.
" విజయ్ , ఆ రాయి ని ఒక్క photo తీసుకొని రా , "

అలా అందరు బయటికి వచ్చేసారు. సీతకి మెలుకు వచ్చింది.
" గాయత్రి, నీకు ఎమ్మన్నా తెలుసా , ఆ రాయి గురించి. " లోకేష్ అడిగాడు.
" లేదు లోకేష్ .. " గాయత్రి సమాధానం చెప్పింది.

Saturday, July 23, 2005

Chapter 1 - "మా" లోకం - ఒక గొలుసు కథ

"మనం కలిసి రెండు సంవత్సరాలు అయిపోయింది కదా "అన్న మధు మాటలకి ఉలిక్కి పడి లేచాడు విజయ్‌.
అసలే వేసవి కాలం, పైగా ఎర్ర బస్సు ప్రయాణం కావటం చేత చాలా అలసటగా వుంది విజయ్‌కి. సెలవలకి మధు తాతయ్య గారి ఇంటికి వెళ్లటానికి ఎందుకు ఒప్పుకున్నానా అని మనసులోనే అనుకున్నా, బయటకి మాత్రం ఒక రకమైన నవ్వు నవ్వి మళ్లీ నిద్ర లోకి జారుకున్నాడు.

"కాస్తంత చోటు ఇవ్వండయ్యా! మా చిన్నోడు గొడవ చేస్తున్నాడు"
"కనిపించటం లేదా. ఇద్దరు పట్టే సీటు లో ముగ్గురం సర్దుకున్నాం. వెనుక వెళ్లి అడుగు"
"పొనీ మీరు జరగండి బాబు..."
"గంట నుంచుంటే దొరికింది సీటు. కొంచెం ఆగి లేస్తాను"

" టికెట్ టికెట్...."
" హోల్డాన్‌...పోలవరం వాళ్ళు దిగండి. "
" రయ్ ...రయ్ ..."

బస్సు అంతా కోలాహలం గా వుంది. చల్లటి యేరు గాలి తగలటంతో బస్సు లో ఒక్క సారి నిట్టూర్పులు వినిపించాయి.
" అమ్మా ..ఏమి తాపం రా బాబు" అని ఒక పెద్దాయన చెవి దగ్గర అరవటం తో మెలకువ వచ్చింది విజయ్‌ కి. ఏదో వింత ప్రదేశం లో వున్న అనుభూతి కలిగింది. పక్కన మధు లేక పోవటం గమనించిన విజయ్‌ కి ఒక్క క్షణం గుండె జల్లుమంది. ఊరు కాని ఊరు. పైగా జాగ్రత్త తక్కువ అవటం చేత వున్న డబ్బులు మధు జేబులో పెట్టాడు. మధు దిగిపోయాడా అన్న ఆలోచన వచ్చినా ,
" ఛ! మన వాడు అంత మతి మరపు కాదు లే" అని సర్ది చెప్పుకొని ప్రక్కన కూర్చున్న ఆవిడ ని అడుగుదామని తిరిగాడు. ఆవిడ మంచి నిద్ర లో వుంది. బయట చల్ల గాలి కంటే ఎండే ఎక్కువగా తెలుస్తోంది విజయ్‌ కి. అసహనంగా వున్న వాడి కోసమే అన్నట్లు ఆవిడ కదలటంతో అడగటానికి మొహమాట పడుతూనే అడిగాడు.
" మా వాడిని ఏమన్నా చూశారా?"
"ఎవరు బాబూ. లావుగా, చామన చాయగా వున్న ఆయనేనా?"
"చామన చాయనా ", బొగ్గు కంటె కొంచెం తెల్లగా వుండే కృష్ణ నీలం గుర్తుకు వచ్చి ఇక్కడ వారి నలుపు స్థాయి గురించి నవ్వు కొని , కష్టంగా తమాయించుకొని
" అవును వాడే అనుకుంటానమ్మా....కాదు వాడేనమ్మా!"
" ఆయనే సీటు ఇచ్చారు బాబూ. అక్కడ కండక్టరు గారి పక్కన మెట్ల మీద వున్నారు" ఆవిడ మాటలు పూర్తి అవ్వక ముందే అటు తిరిగి చూశాడు విజయ్‌. జనం లో కనిపించటం లేదు. మనసులోనే మధు ని అభినందించి,
"ఉండక చస్తాడా. ఉండకపోతే చస్తాడు!" ప్రకృతి ని ఆస్వాదించటం మొదలు పెట్టేడు విజయ్. పల్లె టూరికి రావటం ఇదే మొదటి సారి. పుస్తకాల్లో చదవటమేగాని ఎప్పుడు చూసే అవకాశం రాలేదు. ఏరు గాలి కొంచెం మంద పడటం మొదలయ్యింది. ప్రచండుడు ఆడుకుంటున్నాడు. రోహిణి కార్తె గురించి బామ్మ చెప్తూ వుండేది. చిన్నప్పుడు క్రి క్కెట్టు ఆట పైన వున్న మక్కువ తో ఎండ పట్టించుకోకుండా ఎలా ఆడామా అని ఆశ్చర్యం ఇప్పుడు కలుగుతోంది విజయ్‌కి.

( వంశీ - విజయవాడ - 6/17/5 - సశేషం)